బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బ్లాగ్ వేదికలో 100 ఉత్తమ బ్లాగులు.

మీ అందరి అభిమానానికి దగ్గరవుతున్న బ్లాగ్ వేదికలో 100 ఉత్తమ బ్లాగులు పేరుతో శీర్షిక ప్రారంభించి అంతర్జాలంలో ఉన్న ఉత్తమ బ్లాగులన్నీ కేవలం ఒక 100 వరకు మాత్రమే ప్రవేశ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.ఒకవేళ 100 ఉత్తమ బ్లాగులు దొరికిన తరువాత కూడా మరింత అత్యుత్తమమైన బ్లాగులు కనిపిస్తే వాటిని చేర్చి వాటిలోనుండి కొద్దిగా మాత్రమే ఉన్న బ్లాగులను తొలగించి అత్యుత్తమమైన వాటికి చోటు కలిపిస్తూ 100ఉత్తమ బ్లాగులను చక్కదిద్దుతూ ఉండాలి.ఎందుకంటే ఎవరైనా ఈజీగా చదువుకోడానికి వీలుగా ఉంటుంది.ఈ ఆలోచన మీకు నచ్చితే దయచేసి మీ దృష్టికి వచ్చిన, ఇష్టపడిన బ్లాగులుంటే సూచించండి.క్రింది కామెంట్ బాక్స్ ద్వారా కాని, లేదా sakshyamgroup@gmail.com గాని పంపించవచ్చు.

6 comments:

  1. ఉత్తమ బ్లాగులు అన్న మాట ఆకర్షణీయమే నండీ. అందరికీ మంచి సదుపాయం కూడాను. ఐతే ఉత్తమబ్లాగు అన్న పట్టిలోకి ఏదైనా బ్లాగును ఏ ప్రాతిపదికమీద ఎంపికచేయటం అన్నది గడ్డుప్రశ్న. జనాదరణ ఎక్కువగా పొందినవన్నీ ఉత్తమమైన బ్లాగులు కాకపోవచ్చును. ఉత్తమమైన బ్లాగుల్లో అనేక బ్లాగులకు జనాదరణ హెచ్చుగా ఉండకపోవచ్చును. అలాగే టపల తరచుదనం ప్రకారం లెక్కవేయటమూ సమంజసం కాదు. నాకు నచ్చిన బ్లాగులతో నేనే నా సౌకర్యం కోసం ఒక పట్టీ తయారు చేసుకుందా మనుకున్నాను కానీ అది కార్యరూపం దాల్చలేదు.

    ReplyDelete
    Replies
    1. గౌరవనీయులు శ్యామలీయంగారూ! మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.మీ అభిప్రాయం చదివిన తరువాత ఏ ప్రాతిపదికపై ఉత్తమ బ్లాగులుగా ఎంచాలా? అనే ప్రశ్న కలిగింది.దీని విషయమై ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని మీ అందరిముందు పెడతాను.మీ అందరి సలహా,సూచనలు తీసుకుని పని మొదలు పెడతాను.

      Delete
  2. ఇది మంచి ఐడియాకాదేమో అనిపిస్తోంది,కొత్త bloggers మంచి బ్లాగ్ లు అనిపించుకోవాలంటే ఈ కాలం లో చాలా కష్టం.....ఎందుకంటే ఫీల్ గుడ్ బ్లాగ్స్ కి లేదా పోస్ట్స్ కి కామెంట్స్ రావు,ఏదైనా సంచలనాలు పోస్ట్ లో కాని బ్లాగ్ లో కాని ఉంటే వారికి viewers ఉంటారు ...
    viewers ప్రతి పాదికన బ్లాగ్ లను ఉత్తమ బ్లాగ్ లు అని చెప్పడం ,కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం,వీలైతే కొత్త బ్లాగ్ లకు ట్రాఫిక్ రేట్ పెరిగే ఐడియా ఆలోచించండి

    ReplyDelete
    Replies
    1. తెలుగు బ్లాగుల అభివృద్ధి కొరకు నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటున్నాను శ్రీనివాస్ గారు.ఇక ఉత్తమ బ్లాగుల పట్ల మీరన్న అభిప్రాయం కరెక్టే! మనమందరమూ చర్చించి మంచి నిర్ణం తీసుకుందాము.

      Delete
  3. అంటున్నారు బానే ఉంది. కానీ చేయడం లేదు. వెంటనే ప్రారంభించండి. చాలా బాగుంటుంది. మంచి బ్లాగును నిర్ణయంచడానికి మీరు ఏ విషయాన్ని ఆధారంగా తీసుకుంటారనేది కీలకం అయిన విషయం. మరింత స్పష్టత ఇస్తే బావుంటుంది.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా ప్రారంభిస్తాను చైతన్య కుమార్ గారు.బ్లాగ్ వేదిక ఏదైతే చేయాలనుకుందో, ఏవైతే చేస్తానని ప్రకటించిందో అవన్నీ తప్పక నిర్వహిస్తుంది.ఇకపోతే ఉత్తమ బ్లాగుల విషయంలో ఆలోచించి మంచి నిర్ణయం చేసి మీముందు పెడతాను.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...