బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంట్ చచ్చిపోయిందా?

తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంట్ చచ్చిపోయినట్లుంది.ఈ మద్య ఏ సినిమా వచ్చినా గతంలో తీసిన నాలుగైదు సినిమాలనే మిక్స్ చేసి కొత్తగా మరో స్టోరీ అల్లుతున్నారు.తీరా పేక్షకుడిని అలరిస్తుందా అనుకుంటే అదీ లేదు.ముందు చూసిన సినిమాలన్నీ గుర్తుకొచ్చి ధియేటర్లో ఎక్కడ కూర్చున్నాడో కూడా తెలియక ఆ సినిమాలు అర్ధం కాక బ్రతుకు జీవుడా అనుకుంటూ పారిపోతున్నారు.థమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లైతే అంతే సంగతులు.డప్పులు మోత వెంట తరుముతున్నట్టే!

మొబైల్ బిల్లులు భారీగా తగ్గుతున్నాయ్, ఎందుకంటే..

Mobile-bills-are-falling-heavily-because-blog-vedika-news
త్వరలో మొబైల్ బిల్లులు భారీగా తగ్గబోతున్నాయ్. ప్రతి యేటా తగ్గుతున్న ఈ మొబైల్ బిల్లులు ఈ సారి భారీగా తగ్గనున్నాయని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఏర్పడిన టెలికం కంపెనీల మధ్య పోటీ, డేటా, వాయిస్ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడంతో ఆకాశంలో ఉన్న మొబైల్ బిల్లులు నేలకు దిగివచ్చిన సంగతి తెలిసిందే..అవి ఇంకా 30 శాతం తగ్గనున్నాయట...Read more

బ్లాగింగ్ లో ఉన్న ఆనందం చాలా గొప్పది.

మన భావాలుగాని, మన ఆలోచనలుగాని నలుగురితో పంచుకునే ఓ గొప్ప వేదిక బ్లాగ్. నాకైతే ఖాళీ దొరికితే చాలు ఈ బ్లాగింగ్ చేయడంలోనే సమయం గడుపుతాను. నా ప్రధాన దినచర్యలుగా పుస్తక పఠనం, బ్లాగింగ్ ఉన్నాయి.తెలుగు బ్లాగుల ప్రపంచంలో దొరకని అంశమంటూ ఏదీ లేదు. ప్రతి అంశం మీదా తెలుగు బ్లాగులున్నాయి. మీరు కూడా వీలయితే మీకు తెలిసిన స్నేహితులకు... బ్లాగులను చదవడం బ్లాగింగ్ చేయడం గూర్చి తెలియజేసే ప్రయత్నం చేయండి. మిగత భాషల కంటే మన తెలుగు బ్లాగులను ఉన్నత స్థితిలో ఉంచాల్సిన బాధ్యత మనదే! అవునంటారా? కాదంటారా?

బ్లాగును క్రియేట్ చేయడం ఎలా?

నోసాక్షిలాంటి వారితో పాటు కొంతమంది నాకు కొత్తగా బ్లాగును క్రియేట్ చేయాలంటే ఏమి చెయ్యాలంటూ కామెంట్లు, మెయిల్స్ పంపుతున్నారు. వీరందరి సౌకర్యార్థం కొత్తగా బ్లాగును ఎలా క్రియేట్ చెయ్యాలి? దానికి టెంప్లేట్ ఎలా సెట్ చేయ్యాలి? కొన్ని లేటెస్ట్ విడ్జెట్ ఎలా అమర్చుకోవాలి? బ్లాగును ఆదాయమార్గంగా ఎలా మార్చుకోవాలి ఇత్యాది విషయాలను మీ కొసం అందిస్తాను. ఇది కేవలం కొత్తవారి కోసమే! దయచేసి ఇప్పటికే బ్లాగరుగా ఉన్నవారు విసుక్కొవద్దని మనవి. వీలయితే మీ సలహాలు అందించండి. కొత్త బ్లాగర్లకు అనుకూలంగా ఉంటుంది, సహకారంగా ఉంటుంది.తరువాతి పోస్టులో కలుద్దాం బై!!

మీ బ్లాగ్ Off Page : SEO గూర్చి పూర్తిగా తెలుసుకోండి.మీ బ్లాగును టాప్ పొజిషన్లో నిలబెట్టుకోండి.

Get-Your-Blog-Off-Page-Learn-about-SEO
హాయ్ ఫ్రెండ్స్!.. మీ ముందుకు కొత్త ట్రాఫిక్ తో వచ్చేసా! ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనమందరమూ బ్లాగును నడుపుతూ ఉంటాము. నిజానికి మనకి అగ్రిగేటర్స్ ద్వారా తప్ప Google సెర్చింజన్ ద్వారా విజిటర్స్ రావడం బహు తక్కువ. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మన బ్లాగును SEOకి  అనుగుణంగా తీర్చి దిద్దకపోవడం ఒక కారణమైతే, మన బ్లాగులోని పోస్ట్ ఏవిధంగా పెట్టాలో తెలియక పోవడం మరొక కారణం. ఇంకా ప్రధానమైన సమస్య ఏమిటంటే Off Page : SEO గురించి అసలు తెలుసుకోకపోవడం. అంతర్జాలంలో ఎన్నో కోట్ల బ్లాగులుంటాయి. వాటిని తట్టుకుని మన బ్లాగు తన ఉనికిని చాటుకోవాలంటే మనకి Off Page : SEO గూర్చి తప్పక తెలియాలి. అప్పుడే మనం Google లో మన హవా చాటగలం. లేదంటే మన బ్లాగును మనం చూసుకోవడం తప్ప మరొకరు వీక్షించే అవకాశమే లేకుండా పోతుంది.

ఈరోజు తెలుగు బ్లాగ్ అగ్రిగేడర్ల ఉనికి మాయమవుతూనే ఉంది. కూడలి పోయిన తరువాత కేవలం మాలిక, శోధిని మాత్రమే మిగిలాయి. ఆ తరువాత  బ్లాగ్ వేదిక లాంటి కొన్ని బ్లాగ్ అగ్రిగేడర్లు కొద్దో,గొప్పో పని చేస్తూ ఉన్నాయి. వీటి ద్వారా విజిటర్స్ సంఖ్య పెద్దగా ఏమీ రావడం లేదు. ఇంతకుముందు బ్లాగులో ఒక పోస్ట్ పెడితే కనీసం 250 మంది విజిటర్స్ వచ్చేవారు. ఇప్పుడు 50 మంది విజిటర్స్ రావడమే కష్టంగా మారిపోయింది. సబ్జెక్ట్ ఎంత బాగున్నా విజిటర్స్ సంఖ్య ఏమాత్రం పెరగడం లేదు. నిజానికి అగ్రిగేడర్ల ద్వారా వచ్చే వీక్షకులు పూర్తిగా తగ్గిపోయారు.

Off Page : SEO చేసిన బ్లాగులు మాత్రం google సెర్చింజన్ ద్వారా బాగానే విజిటర్స్ ని సంపాదించుకుంటున్నాయి. ఈ విషయాన్ని పరిశీలించిన తరువాత మన తెలుగు బ్లాగర్స్ కి కూడా Off Page : SEO గూర్చి వివరాలు తెలియజేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఒక బ్లాగర్ తన బ్లాగును కొంతమందైనా విజిట్ చేసి తన పోస్టులు చదివితే అతనికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి మంచి,మంచి పోస్టులు పెట్టగలుగుతాడు. దాని వలన మనం కొంతవరకైనా తెలుగు బ్లాగుల ఉనికిని కాపాడుకున్న వాళ్ళమవుతాము. ఏమంటారు?

అసలు మనం పోస్టు ఏవిధంగా పెట్టాలి? బ్లాగును SEO ఏవిధంగా చేయాలి? Off Page : SEO అంటే ఏమిటి? ఇత్యాది విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. ముందుగా మనం Off Page : SEO ఎన్ని రూపాలుగా ఉంటుందో తెలుసుకుందాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వివరణ అంతా ఈ బ్లాగులో అందిస్తాను. Codes, Setting Details ఈ Sakshyam Creative అనే బ్లాగులో అందిస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ బ్లాగును మెయిల్ ద్వారానూ, గూగుల్ ప్లస్ ద్వారానూ ఫాలో కావడానికి Subscribe నన్ను చేసుకుని ప్రోత్సాహించండం మర్చిపోవద్దు.

ఇప్పుడు Off Page : SEO Details కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మరో 9.. వరుస షాకులతో చైనా కంపెనీలు విలవిల

చైనా కంపెనీలకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో 9 స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీచేసింది. యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా భద్రపర్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రక్రియల గురించి తెలియజేయాలంటూ ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపింది. నోటీసులు జారీచేసిన కంపెనీల్లో మోటోరోలో, ఆసుస్‌, హానర్‌, వన్‌ప్లస్‌, కూల్‌ ప్యాడ్‌, ఇన్‌ఫోకస్‌, బ్లూ, ఒప్పో, నుబియాలు ఉన్నాయి...Read More

Another 9 .. with row shocks China companies
..poodanda.Blogillu లేఖిని (Lekhini): Type in Telugu మాలిక: Telugu Blogs
Related Posts Plugin for WordPress, Blogger...