బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు బ్లాగుల ప్రపంచం నుండి కూడలి నిష్క్రమణ!

కూడలి మూత పడుతుందని ఎవరూ ఊహించనేలేదు. కొత్త సంవత్సరం సెలబ్రేట్స్ చేసుకోకుండానే ఓ పవర్ ఫుల్  అగ్రిగేడర్ కనుమరుగయ్యిపోయింది. ఇంతకు ముందే సంకలిని,హారం మూతబడ్డాయి. ఇప్పుడు కూడలి లేకుండా పోయి తెలుగు బ్లాగుల ప్రపంచానికి విషాదాన్ని మిగిలించింది. కూడలి నుండి వచ్చినంతగా విజిటర్స్ మరే అగ్రిగేటర్ నుండి రారు. ఈవిషయంలో కూడలిని దాటుకుని ఎవరూ ముందుకు పోలేకపోయారు. ఈమధ్య కామెంటర్ల పద్ధతి కూడా అస్సలు బాగులేదు. బూతులు తిట్టుకుంటున్నారు. అతి దారుణంగా విమర్శించుకుంటున్నారు. మంచి టపాల కంటే సంబంధం లేని బూతు కామెంట్లే బ్లాగర్లకు మనస్సును నొప్పిస్తున్నాయి. ఇలా ఉంటే తెలుగు బ్లాగుల ప్రపంచం అంతమయ్యిపోయినట్టే! మొత్తానికి మనమందరమూ కల్సీ కూడలికి కృతజ్ఞలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూడలి చేసిన సేవలు మరవదగ్గనివి.

కూడలి,మాలిక అగ్రిగేటర్లలలో కొత్త బ్లాగులు నమోదుకావా?

ఈమధ్య కొత్తబ్లాగులేవీ కూడలి,మాలిక అగ్రిగేటర్లలో అసలు నమోదుకావడం లేదు. నేను ఒక బ్లాగు నిమిత్తం అప్లై చేసి 20రోజులు దాటినా ఇప్పటివరకూ నమోదు కాలేదు సరికదా! దానికి సంబంధించిన ఎటువంటి సమాచారము అందలేదు. ఒకవేళ యాజమాన్యంవారు తమతమ పనుల్లో బిజీ అయ్యిపోయి ఉండవచ్చేమో! లేక తమ అగ్రిగేటర్లలో నమోదవ్వని పరిస్తితి ఉందో. అదే కరెక్ట్ అయితే 6నెలలకు మించి Update కానీ బ్లాగులను తొలగించి కొత్త వాటికి స్థానం కల్పిస్తే మంచిదని నా అభిప్రాయం.

అయ్యో...2రోజుల నుండి కూడలి స్థంభించిపోయింది

ప్రధాన అగ్రిగేటర్ గా కొనసాగుతున్న కూడలి రెండు రోజులనుండి స్థ౦బించిపోయింది. కారణం ఏమిటో తెలియరావడం లేదు. ఈ విషయం కూడలి యాజమాన్యానికి తెలిసో తెలియదో!

తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని నాశనం చేస్తున్నది ఎవరు?

ఈమధ్య బ్లాగులలో కొంతమంది రెచ్చిపోయి విపరీతమైన కామెంట్లు పెడుతూ ఆయా బ్లాగర్లకు విపరీతమైన చికాకు తెప్పించి బ్లాగు లోకంనుండి విరమించుకునేలా చేస్తున్నారు. ఇంతదారుణం మరొకటి ఉందా? ఇది కొంతమందికి సరదా కావచ్చు. కానీ కొంతమందికి చాలా బాధ కలిగిస్తుంది.వారు నచ్చిన బ్లాగులను, టపాలను చదివేవారు కావడం చేత ఒళ్ళుమండి ఈక్రింది విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఎలాగైనా వీళ్ళ బెడద వదిలించాలని చూస్తున్నారు. దానికి ఉదాహరణే ఈ క్రింది కామెంట్ ఎవరో ఆ అరవింద్ గారు ఎక్కువుగా నా బ్లాగులను, మరికొన్ని బ్లాగులను ఆయన ఫాలో అవుతుంటారు. ఒకరి మీద ఒళ్ళుమండి ఈ కామెంట్ పెట్టిండు. ఒకసారి మీరు కూడా చూడండి. క్రింద లింక్ ఇస్తున్నాను.
ఇలా ఒకరికొకరు విమర్శించుకోవడం ఏమి బాగోలేదు. దయచేసి ఎవరి బ్లాగులు వాళ్ళు వ్రాసుకుంటే మంచిది. నచ్చినవి చదవొచ్చు. ఆటపాలలో ఉన్న లోపాలను అక్కడికక్కడే సూచిస్తే బాగుంటుంది గాని తమ బ్లాగులలో ఆయా బ్లాగర్లను విమర్శించడం సంస్కారం కాదని మనవి.
Related Posts Plugin for WordPress, Blogger...